ఏదైనా సినిమా తర్వాత దానిగురించి మర్చిపోతాననీ, రోజువారీ వ్యాపకాల్లో పడిపోతాననీ వేదాంతాన్ని కూడా చెబుతారు. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో "నమో వెంకటేశా" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి విడుదలకానున్నదని చెప్పారు. వెంకీ పుట్టినరోజు ఈనెల 13వ తేదీ. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్య్వూ.
పుట్టినరోజు ఎలా జరుపుకుంటారు?
ప్రత్యేకంగా జరుపుకునే అలవాటు లేదు. ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటాను. ఈ ఏడాది కూడా అంతే. నా దృష్టిలో ప్రతిరోజూ పుట్టినరోజే. మన ముందు కనిపించే పనిని నిజాయితీతో చేస్తే దాని ఫలితమే పుట్టినరోజు చేసుకున్నంత ఆనందంగా ఉంటుంది.
ఫ్యాన్స్‌కి ఏమని చెబుతున్నారు?
బాగా చదవండి. యంగ్ ఏజ్‌ను చక్కగా ఉపయోగించుకోండి. సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.
సంక్రాంతి సెంటిమెంట్ ఉన్నట్లుంది..?
నాకెప్పుడూ సెంటిమెంట్లు లేవు. నా సినిమా ఫలానా సమయానికి విడుదల కావాలన్న రూలేమీ లేదు. సినిమా అంగీకరించాక పూర్తయ్యాక బయటపడటమే నా పని. ఫలితాల గురించి ఆలోచిస్తుంటే చేయాల్సిన విషయాలు అలాగే మిగిలిపోతుంటాయి. ఆ ధోరణి మంచిది కాదని నా ఉద్దేశ్యం. అప్పట్లో సంక్రాంతికి లక్ష్మి చిత్రం బాగా ఆడింది. ఈ సినిమా కూడా ఆడుతుందనే నమ్మకముంది.
టైటిల్‌లో మీ పేరు కన్పిస్తుందే...?
చాలామంది టైటిల్ బావుందన్నారు. కథరీత్యా అనుకోకుండా పెట్టిన టైటిల్. ప్రతిదానికి నమో వెంకటేశా అంటుంటాడు. వెంకటేశ్వరస్వామి భక్తుడు. అమాయకుడు. అలా అని అందరూ ఆటపట్టిస్తారు. ఆ తర్వాత అతను చేసే పనులు చాలా తెలివిగలవాడివిలా ఉంటాయి. అమ్మో... అప్పుడే చెప్పేస్తున్నానే... సినిమా చూడండి...
శ్రీను వైట్లతో చేయడానికి ప్రత్యేక కారణం...?
ఆయనతో ఎప్పటినుంచో చేయాలనుంది. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శ్రీను వైట్ల ఆల్రెడీ అలాంటి కథలో ప్రూవ్డ్. ఈ చిత్రం ఒక మల్లీశ్వరి, ఒక నువ్వు నాకు నచ్చావు తరహాలో ఎంటర్‌టైన్ చేస్తుంది.
రాణా, నాగచైతన్య... ఇలా మీరంతా కలిసి నటించే అవకాశం ఉందా...?
ఇప్పుడు మా ఇంటి నుంచి కూడా చైతన్య, రాణా ఇద్దరు హీరోలు వచ్చారు. వారి నటన, తీరు చూశాక కథకులు ఎవరైనా మేం ముగ్గురం కలిసి చేసేలా కథను సిద్ధం చేస్తే నటించడానకి మేము సిద్ధమే. ప్రేక్షకులకు నచ్చుతుందని అనిపిస్తే చేయడానికి వెనుకాడను.
సినిమా సినిమాకు గ్యాప్‌కి కారణం..?
నాకు సినిమా సినిమాకు ఇంత గ్యాప్ అనేది లేదు. నాకు ఆ ఆలోచన లేదు. మీరు చెప్పాక గుర్తుకు వస్తుంది. అయినా ఖాళీగా ఉండము కదా. వేరే వ్యాపకాలుంటాయి. వాటిని చూసుకోవడే సరిపోతుంది. మేమూ మనుషులమే కదా...
లీడర్ కథ విన్నారా...? ఏమైనా సలాహాలు ఇచ్చారా..?
విన్నాను. శేఖర్ కమ్ముల మంచి కథ ఇచ్చారు. బర్నింగ్ రాజకీయాలపై ఆయన రాసిన కథ చాలా బాగా వచ్చింది. రాణాకు కూడా కొన్ని సలహాలు ఇచ్చాను. అయినా రాణాకు వ్యాపారపరంగా అన్ని విషయాలు తెలుసు. హీరో కాకముందు బిజినెస్ చూసుకునేవాడు.
23 ఏళ్ల మీ కెరీర్ విశ్లేషించుకుంటే ఎలా ఉంది...?
మొదటి నుంచి స్టడీగా నా కెరీర్ నడుస్తుంది. పడిపోవడాలు... లేవడాలు లేవు. శాటిస్‌ఫ్యాక్షన్ ఉంది. పూర్తి సంతృప్తి రాదు. అది ఎవరైనా అంతే. ఏదో కొత్తగా చేయాలని అనిపిస్తుంది.
హీరోగా మారి కోట్లు సంపాదిస్తున్నారు కదా...? ఎలా అనిపిస్తుంది...?
నవ్వుతూ... ఈ లోకంలో అందరూ నటులే. మీరు కూడా మంచి నటులే. అవకాశం రాక ఇలా ఉన్నారు. మమ్మల్ని ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి నటిస్తున్నాం. నిజం చెప్పాలంటే... నా వాయిస్ బావుంటుందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలీదు. నవ్వుతుంటే... నన్ను క్రిటిక్ చేస్తున్నారా...? ఎంజాయ్ చేస్తున్నారా...? అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక కోట్లంటారా... అసలు కోటీశ్వరుడు ఎవరినైనా అడగండి.. సుఖంగా ఉన్నానని చెప్పడు. ఎప్పుడూ ఏదో టెన్షన్ ఉంటుంది. హీరోగా నాకు వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నాను. దానికి తగ్గ కష్టనష్టాలు కూడా ఉంటాయి. సినిమా వారంతా హాయిగా ఉన్నారనుకోవడమూ పొరపాటే.
తారా జమీన్‌పర్ లాంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా..?
తప్పకుండా... మొదట్లో ఆ చిత్రాన్ని ఇంగ్లీషులో చూశాను. దాన్ని చేద్దామనుకుని ఆలోచిస్తుండగా... షారుక్ ఖాన్ చేస్తున్నాడని తెలిసింది. విరమించుకున్నాం. ఇప్పుడు అమితాబ్ "పా" చేశాడు. ఏదైనా అక్కడ ఇలాంటి ప్రయోగాలు తక్కువగానే ఉన్నాయి. మనమూ చేయగలం. సరిపడా కథలతో ముందుకు రావాలి. అలాంటి కథలు చేయాలని నాకూ ఉంది. గతంలో చంటి చేశాను కదా...
ఆర్టిస్టా...? స్టారా..? మీకేది ఇష్టం?
మీరు గొప్ప యాక్టర్ అని ఫోన్ చేస్తే వచ్చే ఆనందం వేరు. స్టార్ అనేది నా దృష్టిలో లేదు. అందరూ స్టార్‌లే. ఇవన్నీ మనం సృష్టించుకున్నవే.
రామానాయుడుగారు, సురేష్ బాబు... వీరిలో ఎవరి పనివిధానాన్ని ఇష్టపడతారు...?
రామానాయుడుగారంటే గౌరవం. ఆయనకు కొడుకుగా పుట్టడం అదృష్టం. ఇక సురేష్ బాబు నాతోటివాడు. మామూలుగానే ఉంటాం. నా సినిమాలకు అన్ని వ్యాపార వ్యవహారాలు సురేష్ చూసుకుంటాడు. ఆ టెన్షన్లు అన్నీ వాడే పడతాడు. ఫ్యామిలీ అంతా వారానికోసారి కలిసి గడపడం చాలా థ్రిల్‌గా ఉంటుంది. ఇదేదో పూర్వజన్మ సుకృతంగా అనిపిస్తుంది అని చెప్పారు వెంకటేష్.
మరి మనం కూడా వెంకటేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెపుదామా.
- All files are for promotional Purpose only.
- Making CD's and selling them is illegal.
- Files are NOT hosting by this domain.
- Delete from your PC after you use them.
- Buy Originals..